: ఈ నెల 14న తిరుపతిలో రాయలసీమ అభివృద్ధి సమితి బహిరంగ సభ
ఈ నెల 14న తిరుపతిలో రాయలసీమ అభివృద్ధి సమితి బహిరంగ సభ నిర్వహించనున్నట్టు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సభకు సీమలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిని తాము రాజధానిగా భావించడం లేదని, 1956లో సీమకు చేసిన నష్టాన్ని మళ్లీ ఇప్పుడు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం 40 శాతం ఓట్లు పడిన టీడీపీకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరిచ్చారని బైరెడ్డి ప్రశ్నించారు.