: ఫుల్లుగా తాగారు... తోటి ఖాకీపైనే దాడి చేశారు


మద్యం సేవించి గొడవపడేవారిని కంట్రోల్ చేయాల్సిన ఖాకీలే ఫుల్లుగా తాగి తోటి పోలీసుపై దాడి చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో గత రాత్రి చోటు చేసుకుంది. మందు తాగిన ఇద్దరు కానిస్టేబుళ్లు మరో కానిస్టేబుల్ పై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే, స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ నర్సింగ్, ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ ఇద్దరూ మద్యం సేవించారు. ఈ సమయంలో, తన స్నేహితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని నర్సింగ్ తో సతీష్ చెప్పాడు. దీంతో, అక్కడ నుంచి ఇద్దరూ కలసి వన్ టౌన్ స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ ముందు సెంట్రీగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి ఎవరు మీరు? అని ప్రశ్నించాడు. అంతే, మమ్మల్నే ఎవరని అడుగుతావా? అంటూ వేణుపై దాడి చేశారు. ఈ క్రమంలో, మ్యాటర్ సీరియస్ కావడంతో పక్కనున్న పోలీసులు కల్పించుకుని వారిద్దరినీ అక్కడ నుంచి పంపించి వేశారు. అయితే, ఈ ఘటనపై ఇంతవరకు కేసు నమోదు కాకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News