: దిగొచ్చిన మోదీ సర్కారు... రచయితలను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, పెరుగుతున్న మతోన్మాదాన్ని నిరసిస్తూ పలువురు రచయితలు, ప్రముఖులు గతంలో తాము తీసుకున్న అవార్డులను వెనక్కిచ్చేస్తున్న వేళ, పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్రం ఓ మెట్టు దిగివచ్చింది. రచయితలు, తమ అవార్డులను తిరిగి ఇవ్వవద్దని, ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలకు వచ్చి, సలహాలు, సూచనలు చేయాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అవార్డుల వాపసు సరైన చర్య కాదని ఆయన అన్నారు. రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తలు ప్రధాని మోదీని కలసి, ఎలాంటి చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారో వెల్లడించాలని రాజ్ నాథ్ కోరారు. ఈ సమస్యలు రాష్ట్రాల శాంతిభద్రతల పరిధిలోనివని, వీటిపై కేంద్రం ఎటువంటి చర్యలూ తీసుకునే వీలుండదని, అవసరమైతే సాయం మాత్రమే చేయగలుగుతుందని ఆయన గుర్తు చేశారు.