: పేలిన సెల్ ఫోన్... యువకుడి దుర్మరణం


సెల్ ఫోన్లు పేలుతున్న ఘటనలు వినియోగదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా, ఇలాంటి ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పాలెంతండాలో చోటు చేసుకుంది. మోహన్ అనే యువకుడు తన సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడుతుండగా... ఒక్కసారిగా అది పేలిపోయింది. దీంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News