: లాడెన్ వంటి ఉగ్రవాది మరణిస్తే సోనియా గాంధీ రాత్రంతా ఏడ్చిందంటున్న కేంద్ర మంత్రి నక్వీ!


నరేంద్ర మోదీ టీంలోని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. "లాడెన్ వంటి ఉగ్రవాది చనిపోయిన వేళ, సోనియాగాంధీ రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఉండివుంటారు. ఓ టెర్రరిస్టును చంపినా, దాన్ని ఆమె మతానికి ముడిపెడుతున్నారు" అంటూ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో నక్వీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. నక్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో డిమాండ్ చేశారు. నక్వీ తన పాప్యులారిటీ కోసమే ఈ తరహాలో మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. తమ పార్టీ సీనియర్ నేతను విమర్శిస్తే, పత్రికల్లో ఫోటో చూసుకోవచ్చని ఆయన భావిస్తున్నాడని చాకో విమర్శించారు. కాగా, తానేమీ తన సొంత మాటలు చెప్పలేదని, గతంలో కాంగ్రెస్ నేత ఒకరు సోనియాపై చేసిన వ్యాఖ్యలనే గుర్తు చేసుకున్నానని నక్వీ అంటున్నారు.

  • Loading...

More Telugu News