: దేశంలో శక్తిమంతమైన వ్యక్తులలో జగన్
దేశంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రస్తుతించింది. శక్తిమంతమైన 100 మంది భారతీయులతో కూడిన వార్షిక సంచికను విడుదల చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ ప్రధానమంత్రి అభ్యర్థులుగా పరిగణింపబడుతున్నవారు కావడం, జాబితాలో ఇద్దరూ అగ్రభాగాన నిలవడం గమనార్హం. మూడో స్థానంలో సోనియా, నాలుగో స్థానంలో ప్రధాని మన్మోహన్, ఐదవ స్థానంలో చిదంబరం ఉన్నారు. సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, రాష్ట్రపతి ప్రణబ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, ములాయంసింగ్ యాదవ్ వరుసగా దేశంలో 10 మంది ప్రభావిత వ్యక్తులుగా నిలిచారు.
ఇక కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన రెడ్డికి పత్రిక 36వ స్థానాన్ని కట్టబెట్టింది. జైలులో ఉన్నప్పటికీ జగన్ పట్ల ప్రజలలో ఆదరణ పెరుగుతోందని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలూ ఉన్నాయని పేర్కొంది.