: నిత్యావసర ఔషధాల ధరలపై నియంత్రణ విధింపు
నిత్యావసర ఔషధాల ధరలను ఇష్టానుసారం పెంచకుండా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) చర్యలు తీసుకుంటోంది. మరో 15 రోజుల్లో మార్కెట్ లో విడుదలకానున్న 18 నూతన బ్రాండ్లకు చెందిన ఔషధాల ధరలపై నియంత్రణ విధించినట్టు తెలిపింది. వాటిలో మధుమేహం, హైపర్ టెన్షన్, న్యూమోనియా వంటి వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఔషధాల ఎమ్మార్పీ ధరల ఆధారంగా వాటి గరిష్ఠ రిటైల్ ధరను ఎన్పీపీ నిర్ణయించింది. ఆ ధరలనే ఫార్మాసూటికల్ కంపెనీలు నిర్ణయించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒకవేళ ఔషధాలపై అధికంగా వసూలుచేస్తే ఆ మొత్తానికి డిపాజిట్ ను వడ్డీ సహా చెల్లించాల్సి ఉంటుందని ఆదేశంలో పేర్కొంది.