: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో,ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు.