: అత్యంత విలువైన 'నేషన్ బ్రాండ్'... టాప్-7లో ఇండియా
ప్రపంచంలోని 7వ అత్యంత విలువైన ‘నేషన్ బ్రాండ్’గా భారత్ నిలిచింది. ఆర్థిక రంగంలో సేవలందిస్తున్న 'బ్రాండ్ ఫైనాన్స్' ఈ జాబితాను వెలువరించగా, గత సంవత్సరంతో పోలిస్తే ఇండియా బ్రాండ్ విలువ 32 శాతం పెరిగి 2.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో 19.7 బిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. ఆపై చైనా, జర్మనీ, యూకే, జపాన్, ఫ్రాన్స్ ఉన్నాయి. 2014తో పోలిస్తే చైనా బ్రాండ్ విలువ 1% తగ్గడం గమనార్హం. బ్రిక్స్ దేశాల్లో విలువను మెరుగుపరచుకున్న ఏకైక దేశం ఇండియా కావడం గమనార్హం. కాగా, ఓ దేశంలో అందుబాటులో ఉండే అన్ని రకాల బ్రాండ్ల ఐదేళ్ల భవిష్యత్ అమ్మకాల అంచనాలపై ఆధారపడి ఈ విలువను అంచనా వేసినట్టు బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించింది. భారత్ కు ‘ఇన్ క్రిడబుల్’ ఇండియా నినాదం అనుకూలించిందని, జర్మనీకి ఫోక్స్ వ్యాగన్ ఉదంతం ప్రతికూలించిందని పేర్కొంది. చైనా స్టాక్ మార్కెట్ పతనం, అర్థిక వృద్ధి నిదానించడం వంటి అంశాలు అమెరికాకు అనుకూలంగా నిలిచాయని తెలియజేసింది.