: అమరావతి నిర్మాణమే ప్రధాన ఎజెండా... నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ
ఏపీ కేబినెట్ భేటీ నేటి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన విజయవాడలో జరగనుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే దసరా పర్వదినాన రాజధాని శంకుస్థాపనను అంగరంగ వైభవంగా నిర్వహించిన ప్రభుత్వం ఇక నిర్మాణంపై దృష్టి సారించింది. రాజధాని నిర్మాణానికి సేకరించాల్సిన భూములకు సంబంధించిన నోటిఫికేషన్, ఇప్పటికే భూములిచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీ, హైదరాబాదు నుంచి ఉద్యోగుల తరలింపు, లంక భూములు, అసైన్డ్ భూముల వ్యవహారం, పెండింగ్ పీఆర్సీ తదితర అంశాలపైనా కేబినెట్ సమగ్రంగా చర్చించనుంది.