: ఏపీలో మరో జూట్ మిల్లు లాకౌట్... రోడ్డున పడ్డ 2 వేల మంది కార్మికులు
రాష్ట్ర విభజన నేపథ్యంలో కనీసం రాజధాని కూడా లేకుండానే కొత్త పరుగు ప్రారంభించిన ఏపీని పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పెట్టేస్తున్నారు. ఇప్పటికే గుంటూరులో వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న భజరంగ్ జూట్ మిల్లు ఉన్నట్టుండి మూతపడింది. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. రోజుల తరబడి కార్మికులు ఆందోళనకు దిగగా, ఎట్టకేలకు ప్రభుత్వ జోక్యంతో సమస్య పరిష్కార దిశగా పయనిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా వి.టి.అగ్రహారంలో అరుణ జూట్ మిల్లు మూతపడింది. మిల్లును మూసివేస్తూ కంపెనీ యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో 2 వేల మందికి పైగా కార్మికులు రోడ్డున పడ్డారు. కంపెనీ లాకౌట్ ను నిరసిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో కంపెనీ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.