: టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై నేతల కసరత్తు
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ-బీజేపీల ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖరరెడ్డిలు భేటీ అయ్యారు. వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఖరారుపై నేతలు తుది కసరత్తు చేస్తున్నారు. కాగా, ఈ ఉప ఎన్నికలో గెలుపుపై ఆయా పార్టీలు ధీమాగా ఉన్నాయి. లక్షకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.