: 3న జరగాల్సిన పీసీసీ కార్యవర్గ సమావేశం వాయిదా
ఈ నెల 3న విజయవాడలో జరగాల్సిన పీసీసీ కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. దీనిని ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా ఈ నెల 3వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టనుంది. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, పీసీసీ చీఫ్ లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే బెజవాడలో జరగవలసిన పీసీసీ కార్యవర్గ సమావేశం వాయిదా పడింది.