: తమిళనాడులో తెలుగు సంఘాల భారీ ర్యాలీ
తమిళనాడులోని హోసూరులో తెలుగు సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. తమిళనాడులో నిర్బంధ తమిళ భాషా బోధనను వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ జరిగింది. తమిళ సంఘాల సమైక్య వేదిక, చెన్నై, తెలుగు యువత ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. కాగా, తమిళనాడులో రెండో అతిపెద్ద భాష అయిన తెలుగును పాఠశాలల్లో నిషేధించడం పట్ల తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటి వరకు ప్రధాన సబ్జెక్టుగా ఉన్న తెలుగును పాఠ్యాంశాల్లో ఆప్షనల్ గా మార్చుతూ తమిళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. నిర్బంధ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి తెలుగు సంఘాలు రూపకల్పన చేశాయి.