: వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు


బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు ఈ ద్రోణి వ్యాపించి ఉంది. దీని ప్రభావం వలన వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. ఈశాన్య దిశగా తీరం వెంబడి గంటలకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు చెప్పారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. కాగా, గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు...విశాఖ విమానాశ్రయంలో 14 సెం.మీ, విశాఖపట్టణంలో 13 సెం.మీ, అనకాపల్లిలో 10 సెం.మీ, తుని, డెంకాడలో 9 సెం.మీ, భీమిలిలో 8 సెం.మీ, విజయనగరం, కళింగపట్నంలలో 6 సెం.మీ, పలమనేరులో 5 సెం.మీ, గంట్యాడ, చింతపల్లిలో 4 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News