: ఏపీ ప్రజలకు ఊరట... హెల్మెట్ నిబంధన తీసేశామన్న రవాణా మంత్రి శిద్ధా


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరటను కలిగించే నిర్ణయాన్ని రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు ఈ మధ్యాహ్నం ప్రకటించారు. హెల్మెట్ వాడకం తప్పనిసరేమీ కాదని, గడువును మరింతగా పొడిగించామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు వాహనదారులను అడ్డుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. కాగా, నేటి నుంచి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడటం తప్పనిసరిగా అమలు చేయాలన్న ఉద్దేశంతో, ఉదయం నుంచి పలు నగరాలు, పట్టణాల్లో వీధుల్లోకి వచ్చిన పోలీసులు వసూళ్లను మొదలు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో తొలిరోజు పట్టుబడిన పలువురి నుంచి జరిమానాగా రూ. 100 వసూలు చేయగా, మరికొన్ని చోట్ల కొందరు అక్రమార్కులు జేబులు నింపుకున్నారన్న వార్తలూ వెలువడ్డాయి. దీనిపై స్పందించిన శిద్ధా, ముఖ్యమంత్రితో సంప్రదించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. ప్రజలకు హెల్మెట్ వాడకంపై పూర్తి అవగాహన వచ్చిందని తెలుసుకున్నాకే ఈ నిర్ణయం అమలవుతుందని శిద్ధా తెలిపారు.

  • Loading...

More Telugu News