: ఇదిగో సాక్ష్యం... ఆ విమానాన్ని మేమే పేల్చాం: వీడియో విడుదల చేసిన ఐఎస్ఐఎస్


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నిన్న ఈజిప్టులోని సినాయ్ ప్రాంతంలో కూలిపోయిన విమానాన్ని తామే కూల్చేశామనడానికి సాక్ష్యంగా ఓ వీడియోను విడుదల చేసింది. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై రష్యా జరుపుతున్న దాడికి ఇది ప్రతీకారమని స్పష్టం చేసింది. కాగా, ఇంతకుముందు ఈ విమానం ప్రమాదకర పరిస్థితుల్లో కూలిందని, ఉగ్రదాడి లేదని అటు ఈజిప్ట్, ఇటు రష్యా ప్రభుత్వాలు కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. ఈ తాజా వీడియోలో గాల్లో వస్తున్న విమానం పేలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆపై పొగలు కక్కుతూ విమానం కూలడం కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో 224 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఐఎస్ఐఎస్ మూడు గంటల క్రితం విడుదల చేసిన ఆ వీడియోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News