: న్యూజిలాండ్ లో భూకంపం


న్యూజిలాండ్ లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. దేశంలోని ఉత్తర ద్వీపంలో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్టు ఎటువంటి సమాచారమూ అందలేదు. సునామీ భయం కూడా లేదని అధికారులు తెలిపారు. కాగా, భూమికి 55 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. భూకంప తీవ్రత ప్రజలకు స్పష్టంగా తెలిసినట్టు సమాచారం. తాము భయాందోళనకు గురయ్యామని, తన పిల్లలు బయటకు పరుగులు పెట్టారని భూకంప ప్రాంతంలోని మైఖేల్ ఫెనిన్ వివరించారు. అలమరాల్లోని కొన్ని వస్తువులు కింద పడ్డాయని తెలిపారు. కాగా, భూకంపంపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News