: అమ్మ, నాన్న రాలేదన్న బాధ ఉంది... నా పాట, మాట మాత్రం ఆగవు!: గాయని మధుప్రియ


తన వివాహానికి అమ్మ, నాన్న రాలేదన్న బాధ ఉన్నప్పటికీ, తన జీవితంలో తానెలా ఉండాలన్న విషయమై పూర్తి నిర్ణయాధికారం తనదేనని గాయని మధుప్రియ తెలిపింది. తాను మనస్ఫూర్తిగా శ్రీకాంత్ ను కోరుకున్నానని, అతనితోనే జీవితమని నిర్ణయించుకున్నానని, తల్లిదండ్రులు అంగీకరించని కారణంతోనే ఇలా వివాహం చేసుకున్నానని తెలిపింది. ఈ ఉదయం ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తన మాట, పాట ఆగవని, మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా, తన గొంతు వినిపిస్తుందని స్పష్టం చేసింది. వివాహానికి మరికొంత కాలం ఆగవచ్చు కదా? అని కొందరు ఇప్పుడు సలహాలు ఇస్తున్నారని వెల్లడించిన మధు, అన్నీ ఆలోచించిన మీదటే, తన జీవితంలో ఇతనే సరైన వ్యక్తి అని నమ్మినట్టు వివరించింది.

  • Loading...

More Telugu News