: హక్కులను కాపాడలేని ప్రభుత్వం ముందుకెళ్లడం కష్టమే: మోదీ సర్కారుపై రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్య
నరేంద్ర మోదీ నేతృత్వంలోని సర్కారు ప్రజల హక్కులను కాపాడటంలో విఫలమవుతోందని, ఇది వృద్ధి విఘాతమని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య పరస్పర గౌరవం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఇండియా వృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే, ప్రశ్నించే హక్కుకు రక్షణ ఉండాలని ఆయన అన్నారు. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, కొన్ని వర్గాల వారు ఇతర వర్గాలపై భౌతిక దాడులు చేయడం వల్ల భారత్ పై దురభిప్రాయం ఏర్పడుతోందని ఆయన అన్నారు. "సంఘంలో లైంగిక వేధింపులు, భౌతిక దాడులకు స్థానం ఉండకూడదు. ఇదే సమయంలో ప్రతి విషయాన్ని తప్పుగా చూడటం కూడా ఆగిపోవాలి" అని ఆయన అన్నారు.