: 776 మంది రాజకీయ భవిష్యత్తు నిక్షిప్తమయ్యేది నేడే!
బీహారులో నేడు నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 55 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుండగా, 57 మంది మహిళలు సహా 776 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం సాయంత్రానికి ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. మొత్తం 1,46,93,294 మంది ఓట్లర్లు 14,139 పోలింగ్ కేంద్రాల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముజఫర్ పూర్, ఈస్ట్ చంపారన్, వెస్ట్ చంపారన్, సిరీమార్హి, షియోహర్, గోపాల్ గంజ్, సివాన్ జిల్లాల పరిధిలో ఈ నియోజకవర్గాలుండగా, 2010 ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ 26 స్థానాల్లో గెలుపు లభించింది. ఈ దఫా అంతకుమించిన ప్రజల మద్దతు తమకు లభిస్తుందని, బీజేపీ భావిస్తోంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉండటంతో నాలుగు స్థానాల పరిధిలో మధ్యాహ్నం 3 గంటలకు, 8 స్థానాల పరిధిలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.