: విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం: మెట్రో జెట్
ఈజిప్టులోని సినాయి పర్వత ప్రాంతంలో కూలిన విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారమిస్తామని మెట్రో జెట్ ప్రకటించింది. అయితే ఈ నష్ట పరిహారం ఎంత? అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ విమాన ప్రమాదంపై మెట్రో జెట్ అంతర్గత విచారణకు ఆదేశించింది. మృతుల బంధువులు ఈజిప్టు వెళ్లేందుకు మెట్రో జెట్ ఉచితంగా విమానాలను సమకూర్చింది. కాగా, ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది, 17 మంది చిన్నారులు సహా 214 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, సంఘటనా స్థలికి ఈజిప్టు ప్రధాని బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం హై లెవెల్ అథారిటీని విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు సంతాపం తెలిపారు.