: రేపటి నుంచి ఏపీలో హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే కఠిన చర్యలే!


రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం నిబంధన అమల్లోకి రానుంది. రోడ్డు ప్రమాదాలకు గురైన సందర్భంలో కేవలం హెల్మెట్ ధరించని కారణంగానే 70 శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ద్విచక్రవాహనదారులు ఈ నిబంధన తప్పకుండా పాటించాల్సిందేనని, లేని పక్షంలో కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. రెండుసార్లు హెల్మెట్ లేకుండా పోలీసులకు పట్టుబడితే లైసెన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని, మూడోసారి పట్టుబడితే కఠిన శిక్షకు పాత్రులవుతారని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News