: అమెరికా కొండ ప్రాంతంలో భూమికి భారీ పగుళ్లు
అమెరికాలోని కొండ ప్రాంతంలో భారీ పగుళ్లు ఏర్పడడం ఆందోళనకు దారితీస్తోంది. 15 రోజుల క్రిందట వ్యోమింగ్స్ బైఘర్న్ పర్వత సానువుల్లో భారీ పగుళ్లు సంభవించాయి. 750 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో ఏర్పడిన ఈ పగుళ్లు ఆసక్తిరేపుతున్నాయి. ఈ పగుళ్ల వెనుక మిస్టీరియస్ కారణాలేవీ లేవని నిపుణులు చెబుతున్నారు. వానాకాలం కారణంగా క్యాప్ రాక్ మెత్తబడి ఈ పగుళ్లు ఏర్పడి ఉంటాయని ఈ ప్రదేశాన్ని సందర్శించిన ఎస్ఎన్ఎస్ ఇంజనీర్ తెలిపారు. కొండ చరియలు నెమ్మదిగా కదలడం వల్ల ఈ భారీ చీలిక ఏర్పడి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సుమారు 15 నుంచి 20 మిలియన్ అడుగుల మేర కొండ చరియలు కదిలి ఉంటాయని వారు పేర్కొన్నారు.