: పుస్తక గోడౌన్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ అబిడ్స్ లోని బొగ్గులకుంటలో ఉన్న పుస్తకాల గోడౌన్ లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. గోడౌన్ లోని నాలుగో అంతస్తువరకు మంటలు వ్యాపించడంతో పుస్తకాలు పూర్తిగా దగ్దమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, పుస్తకాల గోడౌన్ కు అగ్నిమాపక అనుమతి లేదని తెలుస్తోంది.