: 100 మంది కరుడు గట్టిన బోకోహరమ్ తీవ్రవాదుల ఫోటోలు విడుదల


నైజీరియాలో ఊళ్లకు ఊళ్లను కొల్లగొడుతూ, మహిళలను సెక్స్ బానిసలుగా, పిల్లలను బానిసలుగా మారుస్తున్న బోకోహరమ్ తీవ్రవాదుల ఫోటోలను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. 'వంద మంది అత్యంత కిరాతక బోకోహరమ్ తీవ్రవాదులు' అంటూ నైజీరియా అంతటా వీధి గోడలపై వీరి ఫోటోలను ప్రభుత్వం అతికించింది. ఫోటోల్లో ఉన్న వారి వివరాలు తెలిస్తే తమకు తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. గతంలో బోకోహరమ్ తీవ్రవాదుల స్థావరాలపై దాడులు చేసిన సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా ఈ జాబితాను తయారు చేసినట్టు నైజీరియా ప్రభుత్వం తెలిపింది. ఏకే 47 తుపాకీ పట్టుకుని ఉన్న అబుబకర్ షేక్ ఫోటో చుట్టూ మిగిలిన వారి ఫోటోలను పేర్చి ఈ గోడ పత్రికను రూపొందించారు. కాగా, అబుబకర్ షేక్ మృతి చెందినట్టు గతంలో మూడు సార్లు వార్తలు వెలువడినా, అతను మృతి చెందలేదని, బతికే ఉన్నాడని అందులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News