: టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు నాకే పడుతుందని నమ్ముతున్నా: సిరిసిల్ల రాజయ్య
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం తనను ప్రకటించడంతో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య చాలా సంతోషంతో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు తనకే పడుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ప్రజా వ్యతిరేక విధానాలే తనను గెలిపిస్తాయని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు తనను ఆదరిస్తారనుకుంటున్నానని చెప్పారు.