: విమాన శకలాల్లోంచి రక్షించమంటూ ఆర్తనాదాలు
ఈజిప్టు నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయల్దేరిన రష్యన్ 'ఎయిర్ బస్ 321' విమానం సినాయ్ పర్వత ప్రాంతంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమాన శకలాల దగ్గర సహాయక చర్యలు ప్రారంభించిన భద్రతాధికారులకు విమాన శకలాల్లోంచి రక్షించమంటూ కేకలు వినిపిస్తున్నాయని తెలిపారు. రెండు ముక్కలైన విమానంలో ఒక భాగం శకలాల నుంచి పిల్లల మృత దేహాలను వెలికి తీస్తుండగా, మరో శకలం నుంచి రక్షించాలంటూ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని అధికారి వెల్లడించారు. దీంతో సహాయక చర్యలను వేగవంతం చేశామని వారు వివరించారు. దీంతో ప్రమాదం ఘటనలో క్షతగాత్రులుగా ఎవరైనా బయటపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.