: చంద్రబాబుతో భేటీ అయిన అండమాన్ నేతలు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీగా, తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ... ఒడిషా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో, అండమాన్ నికోబార్ లో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. ఈ క్రమంలో, అండమాన్ నికోబార్ లో టీడీపీ సభ్యత్వాన్ని అక్కడి నేతలు భారీ ఎత్తున చేపట్టారు. ఇప్పటికే 50 వేల సభ్యత్వాలను పూర్తి చేశారు. ఈ రోజు అండమాన్ నికోబార్ కు చెందిన టీడీపీ నేతలు అధినేత చంద్రబాబును కలిశారు. త్వరలోనే లక్ష సభ్యత్వాలను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబుకు వారు చెప్పారు. ఈ సందర్భంగా అండమాన్ నేతలను చంద్రబాబు ప్రశంసించారు.

  • Loading...

More Telugu News