: రష్యా విమాన శకలాల్ని గుర్తించిన ఈజిప్టు అధికారులు... ఘటనా స్థలానికి 45 అంబులెన్సులు


ఈజిప్టు నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెళుతూ కూలిపోయిన ఎయిర్ బస్ 321 విమాన శిథిలాల్ని సినాయక లోని పెనిన్సు ప్రాంతంలో అధికారులు గుర్తించారు. దాంతో వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులంతా దాదాపు మృతి చెంది ఉంటారని ఆ బృందంలోని ఓ అధికారి తెలిపారు. మరోవైపు ఘటనా స్థలానికి 45 అంబులెన్సుల్ని పంపినట్టు ఈజిప్టు అధికారులు చెప్పారు. ఘటనా స్థలం మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యల్లో ఆలస్యం జరుగుతోందన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 17 మంది చిన్నారులు, 200 మంది పెద్దలు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారని తెలిసింది.

  • Loading...

More Telugu News