: సర్దార్ పటేల్ పేరు ఉచ్చరించే అర్హత బీజేపీకి లేదు: రఘువీరా


సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పే అర్హత బీజేపీకి లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. హైదరాబాదులోని గాంధీ భవన్ లో జరిగిన ఇందిరాగాంధీ వర్ధంతి, వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ, భారత దేశాన్ని సుస్థిరమైన దేశంగా నిలిపిన ఘనత ఇందిరాగాంధీకి చెందుతుందని అన్నారు. హస్తం గుర్తుతో అభయం ఇచ్చిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్న పనులకు, సర్దార్ పటేల్ ఆశయాలకు అస్సలు పొంతన లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి అసలు పటేల్ పేరు ఉచ్చరించే అర్హత లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News