: వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య ఖరారు


వరంగల్ లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య పేరు ఖరారైంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఇవాళ మధ్యాహ్నం ఆయన పేరును ప్రకటించింది. గత ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరి చేతిలో రాజయ్య పరాజయం పాలయ్యారు. అయినా మళ్లీ ఆయనకే పార్టీ సీటు కేటాయించడం గమనార్హం. ఈ సీటు కోసం మాజీ ఎంపీలు వివేక్, రాజయ్య, సర్వే సత్యనారాయణల పేర్లను అధిష్ఠానం పరిశీలించింది. చివరకు రాజయ్య వైపే కాంగ్రెస్ మొగ్గు చూపింది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ ను ప్రకటించగా, ఇక టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నది తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News