: ఆ గ్రహశకలం ఓ పుర్రెలా ఉంది: నాసా
ఈ రోజు '2015 టీబీ 145' అనే గ్రహశకలం భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. భూమికి 4,90,000 కిలోమీటర్ల దూరం నుంచి అది ప్రయాణించబోతోంది. దీంతో, మనకు ఎలాంటి ఆపద లేదు. హవాయిలో ఉన్నటువంటి నాసాకు చెందిన ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ఫెసిలిటీ (ఐఆర్టీఎఫ్) నుంచి శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని పరిశీలిస్తున్నారు. ఐఆర్టీఎఫ్ డేటా ప్రకారం... ఈ గ్రహశకలం ఒక మృత తోకచుక్క అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక పుర్రె ఆకారంలో అది ఉందని ఐఆర్టీఎఫ్ ప్రోగ్రాం సైంటిస్ట్ కెల్లీ ఫాస్ట్ చెప్పారు.