: సామాన్యుడిని ఎంపిక చేసే దమ్ము ఇతర పార్టీలకు లేదు: వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్


వరంగల్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకుగాను సీఎం కేసీఆర్ కు పసునూరి దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు. 2001 నుంచి పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి తనకు లోక్ సభ టికెట్ ఇచ్చినందుకు సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటానని టీ న్యూస్ తో చెప్పారు. లోక్ సభ ఎన్నికకు సామాన్యుడిని ఎంపిక చేసే దమ్ము ఇతర పార్టీలకు లేదని, అలాంటి సాహసాన్ని కేసీఆర్ చేశారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు ఇచ్చే వారికే ప్రతి పార్టీ టికెట్లు ఇస్తున్న ప్రస్తుత రోజుల్లో తనకు పిలిచి మరీ టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News