: మార్కాపురం ఎస్సైపై దాడి... నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా అటాక్
ఏపీలోని ప్రకాశం జిల్లాలో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన ఓ ఎస్సైపై దాడి జరిగింది. జిల్లాలోని మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్టెక్టర్ గా పనిచేస్తున్న శ్రీహరి ఓ కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లారు. ఎస్సై రాకను ముందుగానే పసిగట్టిన నిందితులు ఆయనపై మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఎస్సైని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఎస్సైపై దాడికి దిగిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.