: అమరావతిలో పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తాం: సీఎం చంద్రబాబు


సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఎ.కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఏక్తా దివస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పటేల్ విగ్రహం నెలకొల్పుతామని ప్రకటించారు. దేశ ఐక్యతను కాపాడిన మహానేత పటేల్ అని, దేశంలో సంస్థానాల విలీనానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ముఖ్యంగా జాతి గుర్తుంచుకోదగిన నేత పటేల్ అని పేర్కొన్నారు. దేశ ఐక్యత కోసం పటేల్ ప్రధాని పదవిని త్యాగం చేశారన్నారు. ఆయన జీవితం యువతకు ఆదర్శమని, భావితరాల కోసం ఆలోచించే వారని చెప్పారు.

  • Loading...

More Telugu News