: రచయితలు, శాస్త్రవేత్తలకు అవార్డులు ఇచ్చి తప్పు చేశామనిపిస్తోంది: కిషన్ రెడ్డి


దేశంలో పలువురు రచయితలు, శాస్త్రవేత్తలు, మేధావులు అవార్డులు వెనక్కిచ్చివేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. వారు అవార్డులు తిరిగిచ్చివేయడం శోచనీయమన్నారు. వాళ్లకు అవార్డులు ఇచ్చి తప్పు చేశామనిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ లో విలేకరులతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎమర్జెన్సీ సమయంలో, సిక్కులను ఊచకోత కోసినప్పుడు మేధావులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి సహించలేకపోతున్నారని, స్వార్థం కోసం ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News