: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను బలిగొన్న ఆర్టీసీ బస్సు
ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యానికి సామాన్యులు బలవుతున్నారు. హైదరాబాద్ నగరంలో పలు రోడ్డు ప్రమాదాలకు ఆర్టీసీ బస్సులు కారణమవుతున్న సందర్భాలను చూస్తూనే ఉంటాం. తాజాగా, ఈ ఉదయం చింతల్ ఐడీపీఎల్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఉదయం తన బైక్ పై హైటెక్ సిటీకి వెళుతుండగా... బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో రాంబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.