: లాలు ప్రసాద్ యాదవ్ పై పట్నా పీఎస్ లో కేసు


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను 'నరమాంస భక్షకుడు' అంటూ వ్యాఖ్యానించిన ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ పై కేసు నమోదైంది. లాలూ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పట్నాలోని సెక్రెటేరియట్ పోలీస్ స్టేషన్ లో లాలుకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. లాలు వ్యాఖ్యలు సమంజసం కాదని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు.

  • Loading...

More Telugu News