: బలవంతం చేయకుంటే తప్పెలా అవుతుంది సార్?...మాయగాడి ప్రశ్నతో షాక్ తిన్న ఖాకీలు!
ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరిట హైదరాబాదులో వేలాది మంది యువతులను ఉచ్చులోకి లాగి వందలాది మందిని నయవంచనకు గురి చేసిన మాయగాడు మధు పోలీసుల విచారణలో ఏమాత్రం బెదరడం లేదట. తనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని స్వయంగా ఒప్పుకుంటున్న మధు, అసలు తాను తప్పే చేయలేదని వాదిస్తున్నాడు. విచారణలో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన నిందితుడు తమనే ఎదురు ప్రశ్నలు అడుగుతుండటంతో సీసీఎస్ పోలీసులు షాక్ తిన్నారు. అసలు విషయంలోకి వస్తే... ఉద్యోగాల పేరిట యువతులను వంచనకు గురి చేసిన మధును ఇటీవలే హైదరాబాదు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన పోలీసులు విస్తు గొలిపే పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని కోర్టు అనుమతితో నాలుగు రోజుల క్రితం సీసీఎస్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తొలి రెండు రోజుల విచారణ కాస్తంత సాఫీగా సాగినా, నిన్న జరిగిన మూడో రోజు విచారణ సందర్భంగా మధు పోలీసులకు షాకిచ్చాడట. ‘‘నేను ఎవరినీ మోసం చేయలేదు. బలవంతంగా అఘాయిత్యమూ జరపలేదు. అలాంటప్పుడు నేను ఏం తప్పు చేసినట్లు సార్?’’ అని మధు పోలీసులను ప్రశ్నించాడట. అతడి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు తల పట్టుకున్నారట.