: ఓరుగల్లులో విజయం కాంగ్రెస్ దే...మెజారిటీ 1,02,500: ఉత్తమ్ జోస్యం


వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ పార్టీనే వరిస్తుందట. ఇంకా నామినేషన్ల ఘట్టం ముగియలేదు, కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ఖరారు కూడా చేయలేదు, అప్పుడే అక్కడి ఫలితంపై ఈ వ్యాఖ్య చేసింది ఎవరో తెలుసా? ఇంకెవరండి బాబూ... ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ (టీ పీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డే. అంతేకాదండోయ్, ఈ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి 1,02,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని కూడా ఉత్తమ్ బల్ల గుద్ది మరీ చెప్పారు. గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం సందర్భంగా ఆయన ఈ మేరకు ఆసక్తికర ప్రకటన చేశారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు సార్లు సర్వే చేశామని, తమ పార్టీ అభ్యర్థిదే విజయమని సదరు సర్వేలో తేలిందని ఉత్తమ్ చెప్పారు.

  • Loading...

More Telugu News