: ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణపై పోలీస్ కంప్లైంట్...టీఅడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదును స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో కేంద్ర మంత్రి హోదాలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంటూ వరుస కథనాలు ప్రచురిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై పోలీస్ కంప్లైంట్ నమోదైంది. టీ అడ్వొకేట్ జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్ధన్ రెడ్డి చేసిన ఫిర్యాదును హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీసులు స్వీకరించారు. కేసీఆర్ పై నిరాధారమైన వార్తలు ప్రచురిస్తూ రాధాకృష్ణ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆ ఫిర్యాదులో గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సరైన ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. కేసీఆర్ పై రాధాకృష్ణ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News