: గుడిమళ్ల స్థానంలో పసునూరి... చక్రం తిప్పిన మంత్రి కేటీఆర్!


వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా గుడిమళ్ల రవికుమార్ దాదాపుగా ఖరారయ్యారు. మొన్నటి పార్టీ నేతల భేటీలోనే ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూత్రప్రాయంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న గుడిమళ్ల అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన లాంఛనమేనన్న వాదన కూడా వినిపించింది. అయితే ఉన్నట్టుండి గుడిమళ్ల పేరుకు బదులు పసునూరి దయాకర్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. దీని వెనుక భారీ తతంగమే నడించిందని తెలుస్తోంది. కేసీఆర్ కుమారుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చక్రం తిప్పిన నేపథ్యంలోనే పార్టీ పసునూరి పేరును ప్రకటించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి పార్టీ యువనేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు పార్టీ సీనియర్ నేత, మంత్రి హరీశ్ రావు మద్దతు పలకగా... కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వ వైద్యుడిగా మంచి పేరున్న రమేశ్ అభ్యర్థిత్వానికి ఓటేశారు. అయితే వీరిద్దరికీ చెక్ పెడుతూ కేటీఆర్ తాననుకున్న దయాకర్ కు టికెట్ ఇప్పించుకుని, వారిద్దరికీ షాకిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకోసం కేటీఆర్ వరంగల్ ఎంపీ పదవికి రాజీనామా చేసి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరితో సమన్వయం చేసుకుని తన పని కానిచ్చేశారని సమాచారం.

  • Loading...

More Telugu News