: వరంగల్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్
వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ ను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. గతంలో వర్ధన్నపేట నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ గా ఆయన పనిచేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతి ఊరిలోనూ ఆయన పంచారు. 2014 ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసే అవకాశం దయాకర్ కు ఇవ్వకపోయినప్పటికీ ఆయన పార్టీనే నమ్ముకుని ఉన్నారు. దయాకర్ అందరితోనూ కలుపుగోలుతనంతో ఉంటారని చెబుతారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా సంగెం మండలంలోని బొల్లికుంట. ఫైన్ ఆర్ట్స్ లో ఆయన డిగ్రీ చేశారు.