: సరికొత్త స్మార్ట్ రింగ్... బిల్లు కట్టడానికి ఇది చాలు!
జేబులోంచి పర్స్ తీసే పని లేకుండా.. చేతికున్న స్మార్ట్ రింగ్‌తో బిల్ కట్టేయొచ్చు. అవును, ఈ సరికొత్త స్మార్ట్ రింగ్ మీరు ధరిస్తే చాలు! అయితే, అంతకంటే ముందుగా కెర్వ్ సైట్లో ఓ ఖాతా తెరవాలి. అందులో కొంతమొత్తం జమ చేయాలి. ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీతో పనిచేసే ఈ రింగ్‌తో ఒక్కసారికి 46 డాలర్ల బిల్లు కట్టొచ్చు. బిల్ కట్టగానే స్మార్ట్ రింగ్ లో మిగిలి ఉన్న డబ్బు వివరాలు, మనం ఖర్చు చేసిన వివరాలను మొబైల్‌కి మెసేజ్ పంపుతుంది. ఈ స్మార్ట్ రింగ్ కు ఛార్జింగ్, బ్లూటూత్, మొబైల్ అవసరమే లేదు. జేబులో డబ్బులు లేకపోయినా, పర్సులో కార్డులు లేకపోయినా ఈ స్మార్ట్ రింగ్ ధరించి వెళితే చాలు, మన పని చేసుకుని బయటపడవచ్చు.