: ‘బలిమెల’ నీటి వినియోగంపై సమావేశం
ఆంధ్ర, ఒడిశాకు నీరందించే బలిమెల జలాశయంపై రెండు రాష్ట్రాల అధికారుల సంయుక్త సమావేశం ఈరోజు జరిగింది. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా ఒర్కిల్ లో జరిగిన ఈ సమావేశంలో నీటి వినియోగంపై అధికారులు చర్చించారు. ఇప్పటివరకు 18 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదనంగా వాడుకున్నట్లు సంబంధిత లెక్కల్లో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 97 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ 39 టీఎంసీలు వాడుకోవాలని, 58 టీఎంసీలు ఒడిశా వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. రోజు వారీ లెక్కన కనుక చూస్తే 1500 క్యూసెక్కులు ఆంధ్రప్రదేశ్, 1200 క్యూసెక్కులు ఒడిశా రాష్ట్రాలు వాడుకోవాల్సిందిగా సమావేశంలో నిర్ణయించారు.