: నెల్లూరులో రూ.140కే కిలో కందిపప్పు
నెల్లూరు పప్పుల వీధిలో కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ కేంద్రంలో కిలో కందిపప్పు రూ.140కే విక్రయిస్తారని చెప్పారు. కందిపప్పు అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించే వారిని సహించేది లేదన్నారు. మిల్లర్ల వద్ద కందిపప్పు అక్రమ నిల్వలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ కార్డు దారులకు చాలా తక్కువ ధరకే కిలో చొప్పున కందిపప్పును అందించనున్నట్లు చెప్పారు.