: పర్శనల్ విషయాలు వెల్లడించిన బాలీవుడ్ భామ!


పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం తనవల్ల కాదని 'అందరివాడు' సినిమాలో చిరంజీవి సరసన నటించిన రిమ్మీసేన్ చెబుతోంది. కలర్స్ టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న రియాలిటీ షో 'బిగ్ బాస్-9'లో పాల్గొంటున్న రిమ్మీ సేన్ సహ కంటెస్టెంట్ మదన కరీమీతో పలు విషయాలు షేర్ చేసుకుంది. తన వయసు 34 సంవత్సరాలని, ఎనిమిదేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, పిల్లలంటే ఉన్న భయంతోనే వివాహం చేసుకోలేదని, భవిష్యత్తులో వివాహం చేసుకునే ఆలోచన కూడా లేదని రిమ్మీ సేన్ చెప్పింది. దానికి మందన ఆశ్చర్యపోతూ 'ఒక్క బాయ్ ఫ్రెండేనా?' అని అడిగింది. తనకు సులువుగా అందరితో కలసిపోవడం తెలియదని, మొహమాటానికి సర్దుకుపోవడం ఇష్టం ఉండదని, అందుకే ఒక్క బాయ్ ఫ్రెండ్ తోనే ఉన్నానని చెప్పింది. ఏదైనా తన మనసుకు నచ్చితేనే చేస్తానని రిమ్మీ సేన్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News