: ఇక చాలు...సినిమాల్లో నటించడం ఆపాల్సిందే: నటికి ప్రభుత్వం అల్టిమేటం


'నటించింది చాలు...సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టు' అంటూ ఓ సినీ నటికి అల్టిమేటం జారీ అయింది. ఈ అల్టిమేటం జారీ చేసింది తల్లిదండ్రులో లేక కట్టుకున్నవాడో అయితే బావుండేది. కానీ ఇరాన్ ప్రభుత్వం ఆ దేశానికి చెందిన సినీ నటి సదాఫ్ కు ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకూ ఆమె చేసిన తప్పేమిటంటే, తలపై ముసుగు (హిజాబ్) లేకుండా ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. తనకి ఇలా ఉండం ఇష్టం అంటూ ఆ ఫోటోలకు ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇది ఇరాక్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. హిజాబ్ (ముసుగు) లేకుండా ఆడపిల్ల కనిపించడం తప్పు అని స్పష్టం చేస్తూ, తక్షణం సినిమాల్లో నటించడం మానేయాలని స్పష్టం చేసింది. హిజాబ్ ధరించకుండా కనిపించడం అనైతికం అని పేర్కొన్న ప్రభుత్వ వర్గాలు ఆమె ఫోటోకు గ్రాఫిక్స్ చేసి ఓ హిజాబ్ (ముసుగు) తొడగడం విశేషం. దీనిపై సదాఫ్ మాట్లాడుతూ, తాను ఇరాన్ నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని ఊహించలేదని తెలిపింది. ఇరాక్ ప్రకటనకు ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదని చెప్పింది. తాను జీవించాలనుకున్న చోట, ఎలా ఉంటే ఆనందంగా ఉండగలనో అలా ఉంటానని స్పష్టం చేసింది. ఇలాంటి వేధింపులు ఇరాన్ లోనే కాదని తన వృత్తిలో కూడా ఉన్నాయని సదాఫ్ వెల్లడించింది. తాను నటిస్తున్నప్పుడు దర్శకుడు తనను తప్ప, తన నటనను చూడడం లేదని వాపోయింది. సీన్ ఎప్పుడైపోతుందా? తన చెవిలో గుసగుసలు ఎప్పుడు మొదలు పెడదామా? అని చూస్తున్నారని, సినీ రంగం మొత్తం అలాగే ఉందని తెలిపింది. ఐదారు కాంట్రాక్టులు చేతిలో ఉంచుకుని, తమతో నెల రోజులు గడిపితే ఆ కాంట్రాక్టులు ఇస్తామంటారని ఆవేదన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News