: కృపామణి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరులో సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కృపామణి తల్లి లక్ష్మి, తమ్ముడు రాజకుమార్, మరదలు కల్యాణిని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని దెందులూరు మండలం చల్లచింతలపూడిలో వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. పుట్టింటి వారే వ్యభిచారం చేయాలని వేధిస్తున్నారంటూ కొన్ని రోజుల కిందట లేఖ రాసి, కృపామణి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.